బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వారిద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ సాధిస్తుంటే, బాలీవుడ్ హీరోయిన్ గా అనుష్క శర్మ కూడా బాలీవుడ్ లో తన హావ కొనసాగిస్తోంది. వీరిద్దరూ ఎంత చిన్న ఖాళీ సమయం దొరికినా ఏదో ఒక ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అనుష్క శర్మ తనకు షూటింగ్ లు లేని సమయంలో టీమిండియా మ్యాచ్ లను చూడటానికి విరాట్ కోహ్లీతో పాటు ప్రయాణాలు చేస్తుంటుంది.

అనుష్క శర్మ విరాట్ కోహ్లీ గురించి చెబుతూ తన భర్త కోహ్లీ దుస్తులు అతడికి తెలియకుండా దొంగతనం చేసి వేసుకుంటానని కోహ్లీ వార్డ్ బోర్డులో ఎన్నో దుస్తులు ఉంటాయని వాటిలో తనకు నచ్చినవి వేసుకొని ఆనందిస్తానని చెబుతుంది. ఎందుకంటే తన భర్త దుస్తులు వేసుకునప్పుడు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న సిరీస్ నుంచి కోహ్లీ విరామం తీసుకుని వీరిద్దరూ భూటాన్ లాంటి మంచు ప్రాంతాలలో ఎంజాయ్ చేస్తున్నారు.