బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కు తీసుకురావడానికి సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది. బాలీవుడ్ లో ఒకే సినిమాను ఇద్దరు దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే డైరెక్టర్స్ అబ్బాస్ – మస్తాన్, రాజ్ – డీకే ఎప్పుడు సినిమాలు తీసినా ఇద్దరు ఒక టీమ్ గా ఏర్పడి సినిమాలు నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక త్వరలో అల్లు అరవింద్ మరో ఇద్దరు నిర్మాతలతో కలసి 500 కోట్ల రూపాయల బారి ఖర్చుతో నిర్మించబోతున్న “రామాయణ” సినిమాకు కూడా నితీష్ తివారి – రవి ఉద్యావర్ ఇద్దరు కలసి దర్శకత్వం వహించనున్నారు.

ఇక ఇదే ట్రెండ్ ను రాఘవేంద్ర రావు ఫాలో కాబోతున్నట్లు తెలుస్తుంది. అనుష్క శెట్టి మరియు నాగ శౌర్య లీడ్ రోల్ గా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు జాగర్లమూడి క్రిష్, బీవీఎస్ రవి, అనిల్ రావిపూడి ముగ్గురు కలసి దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతానికి అనుష్క “నిశ్శబ్దం” అనే సినిమా యూఎస్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. రాఘవేంద్ర రావు చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాలి.