పాపం కన్నా లక్ష్మీనారాయణ కనుక బీజేపీ పెద్దల మాటలు వినకుండా సరైన దిశలో నడిచి ఉంటే ఈరోజు వైసీపీ పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి అధికారం చలాయించడానికి మంచి అవకాశం దక్కేది. కానీ బీజేపీ పెద్దల మాటలు నమ్మి తనకు ఏదో పెద్ద పదవి రాబోతుందని ఆశ పడి అక్కడే ఉన్నందుకు ముందు ముందు రోజులలో చుక్కలు కనపడేలా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది.

కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట పార్లమెంట్ కు పోటీ చేసి ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. ఓడిపోయిన పర్వాలేదు తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కదా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో తన మీద దయతలచి మాంచి బంగారం లాంటి పోస్ట్ ఇస్తారులే అని ఆశ పడ్డాడు. ఆశ పడితే పడ్డాడు… ఆ ఆశలన్ని తీరే సమయంలో వచ్చిన పెద్ద తుఫానుతో తాను ఎక్కడ కొట్టుకుపోతానేమో అని తన నోటి వెంట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాకుండా ఏపీ సీఎం జగన్ పై ఎగిరెగిరి పడుతూ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.

దీని అంతటికి కారణం బాబు బినామీ బ్యాచ్ గా ముద్రపడిన గరికపాటి, సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి కొంతమందిని బాబు కావాలని వారిని బీజేపీలోకి పంపించాడని గుసగుసలతో పాటు కన్నా లక్ష్మీనారాయణ అంటేనే గిట్టని చంద్రబాబు… బీజేపీ అధ్యక్షుడిగా ఉండటమా అని అతడి బినామీల చేత కన్నాను తప్పించే పని ముమ్మరంగా ఢిల్లీ లెవల్ లో చేపట్టాడట. ఇప్పుడు ఈ బినామీ బ్యాచ్ మొత్తం ఏపీ వ్యవహారాలతో పాటు పార్టీ నడపడానికి కూడా ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడటంతో పాటు, తమలో ఒకరికి ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా కోరారట. ఒకవేళ కనుక ఏపీ అధ్యక్ష పదవి వారి చేతిలోకి వెళితే బీజేపీ పార్టీ మాత్రం చంద్రబాబు కనుసన్నలలో ఏపీలో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ దెబ్బతో తన పోస్టుకే ఎసరు వస్తుందని, తన పోస్ట్ ఊడిపోకుండా ఉండాలంటే ఎప్పుడు వైసీపీ ప్రబుత్వంపై ఏదో ఒక విమర్శతో మీడియా లైమ్ లైట్ ఉండి ఎలాగోలా తాను వైసీపీలో ఉండి అధికారాన్ని ఎలగబెట్టకపోయినా కనీసం జాతీయ పార్టీ అధ్యక్షుడన్న పేరుతోనైనా కొన్ని రోజులు నెట్టుకు రావాలన్న కోరిక, కానీ అతని కోరిక చాల రోజులు ఉండేందుకు ముందు చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేనట్టు వుంది. అక్కడ కూడా తన కులానికి చెందిన వారే ప్రముఖ పాత్ర పోషిస్తే కొత్త ఎత్తుగడలు సిద్ధం చేసుకోవచ్చని బాబు ప్లాన్ అట. ఈ పరిణామాలతో చంద్రబాబు ఆటలు కట్టడి చేసి అమిత్ షా, మోదీ పాపం పార్టీనే నమ్ముకొని ఉన్న కన్నా లక్ష్మీనారాయణనే కొనసాగిస్తారా లేక కులాధిపత్యం చేతిలో బీజేపీని పెట్టి మరొక రాంగ్ స్టెప్ వేస్తారో చూడాలి.