ఈరోజు శాసన మండలి రద్దు చేయాలా ఉంచాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సీఎం జగన్ గత గురువారం అసెంబ్లీ సాక్షిగా తెలియచేసాడు. దానికి సంబంధించి ఈరోజు ఉదయం ఏపీ క్యాబినెట్ సమావేశం కావడంతో పాటు దీనిపై చర్చించి చివరకు సీఎం జగన్ తో పాటు పార్టీ అందరూ మండలి రద్దుకు మొగ్గు చూపడంతో, ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలియచేసారు. దీనితో మరికాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకునే అవకాశం కనపడుతుంది. ఇక ఆ తరువాత కేంద్రానికి పంపించి మండలి రద్దు అంశాన్ని ఆమోదించవలసిందిగా కోరే అవకాశం ఉంది.