ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం జగన్ ని కలిశానన్న ఆయన.. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చానన్నారు. ఆ సలహాలనే సీఎంకి వివరించామన్నారు సోము వీర్రాజు.

రాజధానిపై చంద్రబాబు ఏడు వేల కోట్లు ఖర్చుపెట్టానంటున్నారని.. అసలు ఎక్కడ ఖర్చు పెట్టారో తేల్చాలన్నారు. రాజదానిపై చంద్రబాబు నాయుడు కేవలం హైప్ క్రియేట్ చేశారన్నారు. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలని.. అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం విస్తరించాలన్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం మంచిదే అని ఆయన తెలియచేశారు.