ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో సీఎం ఛాంబర్ లో తన కుటుంబ సభ్యులతో కలసి జగన్ ను కలసిన ఆయన.. తన కుమారుడి రిత్విక్ వివాహానికి ఆహ్వానించారు. అయితే జగన్ ను కలవడంతో ఏవిధమైన రాజకియ ప్రాముఖ్యం లేదంటున్నారు. ఇక గతంలోను కడప జిల్లా జమ్మలమడుగులో జగన్ శంకుస్థాపన చేసిన స్టిల్ ప్లాంట్ కార్యక్రమంలోనూ పాల్గొని ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే.