ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో 38898 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 837 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. అయితే వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివి 48 ఉండగా, రాష్ట్రంలో 789 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 16934 కి చేరింది.

ఇక ఇప్పటివరకు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7632 కి చేరగా, 9096 మంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక ఈరోజు కర్నూలు జిల్లాలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందగా వారి సంఖ్య 206 కి చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 971611 శాంపిల్స్ నిర్వహించనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కొత్త దర్శకుడితో రామ్ చరణ్..?

ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పీకే టీం..!