ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంతవరకు తగ్గుముఖం పట్టింది. మొన్నటివరకు 10 వేలకు పైగా వచ్చిన కేసులు ఇప్పుడు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 66,121 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో కొత్తగా 5,487 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,81,161 కి చేరింది. ఇక ఈరోజు 37 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,745 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 7,210 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,12,300 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 63,116 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 55,66,323 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

గుడ్ న్యూస్.. రష్యా వ్యాక్సిన్ విజయవంతం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..!

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. గొడవపడ్డ నోయెల్, లాస్య..!

భారత్ లో భారీ ఊరట.. 11 రోజుల్లోనే 10 లక్షల మంది రికవరీ..!