ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. మొన్నటిదాకా నిత్యం 10 వేలకు పైన వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు సగానికి సగం తగ్గడంతో కొంత ఊరట కలిగిస్తుంది. గత 24 గంటల్లో 68,429 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో కొత్తగా 6,190 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87,351 కు చేరింది. ఇక ఈరోజు 35 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,780 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 9,836 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,22,136 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 59,435 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57,34,752 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా వివరాలు:

ap corona updates sep29th

బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ఎలా సోకుతుందంటే..!

కేవలం నిమిషాల వ్యవధిలోనే కరోనా నిర్ధారణ పరీక్ష.. నూతన విధానాన్ని ఆవిష్కరించిన WHO

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!