ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 6,235 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,31,749 కు చేరింది. ఇక ఈరోజు 51 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,410 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 10,502 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,51,821 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 74,518 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో 56,569 శాంపిల్స్ పరీక్షించగా, దీంతో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 51,60,700 శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ వచ్చేసింది..!

ఓటిటిలోకి క్రేజి బయోపిక్..!

ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చట..!

డబ్బు అవసరాన్ని పసిగట్టి ఫైవ్ స్టార్ హోటల్ లో సామూహిక అత్యాచారం