ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 76,416 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో కొత్తగా 6,923 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674 కు చేరింది. ఇక ఈరోజు 45 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,708 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 7,796 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,05,090 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 64,876 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 55,23,786 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు:

ap corona updates sep28th