ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంతమేరకు తగ్గినట్లుగా కనిపించింది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 71,806 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో కొత్తగా 6,133 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,93,484 కు చేరింది. ఇక ఈరోజు 48 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,828 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 7,075 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,29,211 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 58,445 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 58,06,558 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

వారిపై నాకు మరింత గౌరవం పెరిగిందన్న మీనా..!

కొత్తపద్ధతిలో వాట్సాప్‌లను క్రాష్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. బాధితుల్లో సెలెబ్రిటీలు..!