ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా సగటున 10 వేల కేసులు వస్తుండగా, ఈరోజు 7,956 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079 కి చేరింది. ఇక ఈరోజు 60 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,972 కి పెరిగింది. ఇక ఒక్కరోజులో 61,529 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

ఇక తాజాగా కరోనా నుండి 9,764 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,74,008 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 93,204 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

‘సర్కారు వారి పాట’కు భారీగా డిమాండ్..!

17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

తెలంగాణ సీఎం సంచలనం.. ఇక పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు..!