ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. కొత్తగా 7782 శాంపిల్స్ పరీక్షించగా, 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 1717 కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 34 కి చేరింది. కాగా 729 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 1012 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూల్ జిల్లాలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 36కి చేరింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 8263 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 67 పాజిటివ్ కేసులు వచ్చాయని.. వారిలో 14 మంది గుజరాత్ నుండి వచ్చిన వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక ఇప్పటివరకు కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 533 పాజిటివ్ కేసులు నమోదవగా, 153 మంది కోలుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 కేసులు మాత్రమే నమోదవగా, విజయనగరం జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు.

జిల్లాల వారీగా కరోనా వివరాలు:

ap corona update may 6th