ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో 27643 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 1062 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 22259 కి చేరింది. ఇక తాజాగా 1332 మంది ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇంత భారీ స్థాయిలో కరోనా బాధితులు కోలుకుని ఒకేసారి డిశ్చార్జ్‌ కావడం ఇదే తొలిసారి.

ఇక ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 11101 కి చేరగా, 10894 మంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక కరోనాతో తాజాగా 11 మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 264 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1077773 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల కంటే రికవరీ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది.

జిల్లాల వారీగా కరోనా వివరాలు:

ap corona updates julay 8th