ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. గత 24 గంటల్లో 9136 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 47 పాజిటివ్ కేసులు వచ్చాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దీంతో మొత్తం ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 2561 కి చేరింది. కాగా 1778 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 727 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా కరోనాతో ఈ రోజు కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 56 కి చేరింది.

ap corona twitter