ఏపీలోను కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. మంగళవారం కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 1717 కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 34 కి చేరింది. కాగా 589 మంది ఈ మహమ్మారి నుండి కోలుకోగా, 1094 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 8263 శాంపిల్స్ పరీక్షించగా, వాటిలో 67 పాజిటివ్ కేసులు వచ్చాయని.. వారిలో 14 మంది గుజరాత్ నుండి వచ్చిన వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది.

ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 46433 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక దేశవ్యాప్తంగా తాజాగా 195 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 1568 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 12727 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 32138 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా వివరాలు:

ap corona updates

దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 195 మరణాలు, 3900 పాజిటివ్ కేసులతో తీవ్ర కలకలం..!

సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న భారతీయునికి 20 కోట్ల జాక్ పాట్..!

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!