ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 74,595 శాంపిల్స్ పరీక్షించగా, 8,218 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776 కు చేరింది. ఇక ఈరోజు 58 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,302 కి పెరిగింది.

ఇక ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుండి 10,820 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకుని మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,30,711 కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 81,763 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 50,33,676 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

బిగ్ బాస్ లో ఎక్కువ పారితోషికం ఎవరికో తెలుసా..!

జగన్ కి జై కొట్టిన మరో టీడీపీ ఎమ్మెల్యే..!

ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ కు ఉత్సాహం కలిగించేలా బీజేపీ చర్యలు