ఎప్పుడైతే ఏపీ ఎన్నికల కమిషన్ గురించి హైకోర్టు తీర్పు ప్రకటించిందో ఆ సమయం నుంచి నిమ్మగడ్డ చేసిన హడావిడి మాములుగా లేదు. తానే ఏపీకి ఎన్నికలాధికారినని తనకు తాను ప్రకటించుకొని చేసిన హడావిడి చూసి టీడీపీ శ్రేణులు మురిసిపోయారు. జగన్ సర్కార్ 151 సీట్లు సాధించినా మా నిమ్మగడ్డే ఏపీ ఎన్నికలధికారని, చంద్రబాబు నాయుడు చెప్పినట్లే ప్రభుత్వం నడవాలని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా వచ్చాయి. ఇక నిమ్మగడ్డ అయితే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తన ఇంటికి సెక్యూరిటీ, ప్రభుత్వ కార్లు పంపించాలని ఆదేశాలు కూడా పంపాడు.

ఇక నిమ్మగడ్డ హడావిడి ఎంత దూరం వెళ్లిందంటే ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న వీవీ ప్రభాకరరావుకు ఫోన్ చేసి స్టాండింగ్ కమిషన్ పోస్టుకి రేపటిలోగా రాజీనామా చేయాలని, తాము ఎన్నికల కమిషన్ లో కొత్త రక్తం ఎక్కించాలని అనుకుంటున్నామని కొత్త స్టాండింగ్ కమిషన్ సోమవారానికి నియమించాలని ఆదేశించారు. దీనికి వీవీ ప్రభాకరరావు తనకు రాజీనామా చేయడానికి కొంత సమయం కావాలని నిమ్మగడ్డను కోరినా దానికి ససేమీరా ఒప్పుకోలేదని దీనితో ఏమి చేయాలో పాలుపోక ఏజీగా ఉన్న శ్రీరామ్ ను అడగగా అతను ఎన్నికల కమిషనర్ స్వీయ పునరుద్ధరణే చెల్లనప్పుడు నిమ్మగడ్డ ఇచ్చే ఎలాంటి ఆదేశాలు చెల్లుబాటు కావని మీరు రాజీనామా చేయవలసిన అవసరం లేదని చెప్పడం జరిగింది.

దీనితో నిన్న ఏజీ మాట్లాడిన తరువాత హైకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు జారీ చేసిన 317 సర్కులర్ ను వెనక్కు తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి తెలియచేసారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని చెప్పారు. దీనితో సోషల్ మీడియాలో నిమ్మగడ్డ మరొకసారి టార్గెట్ గా మారారు. ఇలా తానేదో తోపుని అన్నట్లు, తాను చెప్పిందే చేయాలని నిమ్మగడ్డ వ్యవహారం చూస్తే వెనుకవుండి చంద్రబాబు నాయుడే కథ నడిపిస్తున్నాడా అన్న భావన ప్రజలలో వ్యక్తమవుతుంది.

నిన్న సాయంత్రం ఏజీ శ్రీరామ్ మీడియా సమావేశం తరువాత నిమ్మగడ్డకు నిజంగానే షాక్ అని చెప్పుకోవాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్పష్టంగా ఏజీ శ్రీరామ్ చెప్పడంతో పాటు త్వరలో సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మరొకసారి నేను ఒక రూలర్ ను అన్నట్లు నిమ్మగడ్డ వ్యవహరించిన తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతడు హైకోర్టు తీర్పు తరువాత కాస్త జాగ్రత్త వహించినట్లైతే బాగుండేదని అంటున్నారు. ఇక మరొకవైపున కేంద్ర ప్రభుత్వానికి అతడు రాసిన లేఖపై కూడా ఎంక్వయిరీ నడుస్తుంది. అది పెద్ద ఫోర్జరీ అని బయట నుంచి వచ్చిన లేఖను తాను పంపించినట్లు నిమ్మగడ్డ చెప్పడంపై గత రెండు రోజుల అతడి వ్యవహారశైలితో మరింత బలపడుతున్నాయి.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

చిరంజీవి భజన కొట్టుకుంటుంటే, జగపతిబాబు నిశ్శబ్దంగా సామజిక సేవ కార్యక్రమాలు