కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ రోజు రోజుకి డాక్టర్ల కొరత అధికమవడంతో జగన్ సర్కార్ ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తెలియచేసారు. బోధనాసుపత్రులు, సామజిక ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలలో పని చేసేందుకు 400 మంది జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్ట్, 192 మందిలో మత్తు మందు వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారిని 592 పోస్టులు భర్తీ చేయనున్నారు.

వీరి పోస్టులు భర్తీ తరువాత స్పెషలిస్ట్ డాక్టర్లకు నెలకు 1,10,000 రూపాయల వేతనం ఇవ్వనుండగా, ఎంబీబీఎస్ వైద్యులకు నెలకు 53,975 ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. భవిష్యత్తులో జరిగే శాశ్వత నియామకాలలో వీరికి 15 శాతం ప్రాధాన్యత ఇస్తామని పూర్తి వివరాల కోసం ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైటు లో చూడాలని తెలియచేసారు.