ప్రభుత్వ రంగానికి చెందిన చాల మంది డాక్టర్లు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ, కొంత మంది హాస్పిటల్స్ నడుపుతూ ఆదాయాన్ని సంపాదిస్తుంటారు. అలాంటి వారికి షాక్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి ఇప్పుడు ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వ వైధ్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది.

ఈ కమిటీ దాదాపుగా 100కు పైగా సిఫార్సులు చేయడమే కాకుండా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఆరోగ్య శ్రీ జాబితాలో ఇప్పుడున్న వాటికి మరికొన్ని వ్యాధులను జోడించి ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇక దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు నెలకు 5 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.