కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ సంస్థలో తాము కట్టిన డబ్బు వెనక్కు రాకపోవడంతో అల్లాడిపోతున్న ప్రజలకు మొదటి విడతగా పది వేలు, అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన వారికి ఈరోజు గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం ద్వారా సీఎం జగన్ వారికి ఆన్ లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. సీఎం జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాలలోకి 270 కోట్ల రూపాయలు బదిలీ చేసేసారు.

ఈ సందర్భంగా సీఎం సభలో ఉండి సీఎం సభను తిలకిస్తున్న నరసన్న పేటకు చెందిన ఒక వ్యక్తి నాకు డబ్బులు పడ్డాయోచ్ అని తన మొబైల్ చూపించడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ల్యాప్ టాప్ ద్వారా జగన్ చిన్న బటన్ నొక్కగానే వేలాది ఖాతాలలోకి డబ్బులు జమ కావడంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద వైరల్ గా మారింది. డబ్బులు పడిన వారు ఆనందంతో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పిన హామీలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేపడుతూ ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన కూడా నిలబడంతో వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.