కరోనా వైరస్ తీవ్రంగా విస్తరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. దీంతో ఉద్యోగులకు జీతాల్లో కోతపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా జీతాలు చెల్లించబోతుంది. మే నెల నుండి పూర్తిగా ఉద్యోగులు జీతాలు అందుకోబోతున్నారు. ఈ మేరకు ఫైనాన్స్, ట్రెజరీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ట్రెజరీ సాఫ్ట్ వేర్ లో పూర్తి మార్పులు చేసింది.

గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం, ఐఏఎస్‌లకు 40 శాతం, ప్రజా ప్రతినిధులకు అసలు జీతాలే ఇవ్వలేదు. ఇక గడచిన రెండు నెలలు బకాయిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారు సీఎం జగన్. ఇక సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యయ్యో చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదట

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి..!