ఎప్పుడు ఆంధప్రాంతం వారే బాగుపడాలా, రాయలసీమ వాసులు బాగుపడవద్దా? కొన్నేళ్లుగా పాలించే పాలకులు మాత్రం రాయలసీమ వారు, కానీ అభివృద్ధి మొత్తం ఆంధ్ర ప్రాంతానికి, ఇదెక్కడి న్యాయం… ఇదెక్కడి ధర్మం. కర్నూల్ లో ఎప్పటి నుంచో హైకోర్ట్ పెట్టాలని అడుగుతున్నట్లు, వారి చిరకాల వాంఛను జగన్ సర్కార్ తీర్చనుందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అమరావతిలో హైకోర్ట్ భవనం కట్టినా అది తాత్కాలికమే అని చెప్పడంతో ఇప్పుడు జగన్ సర్కార్ కు కలసి వచ్చింది.

కర్నూల్ – నంద్యాల మధ్యలో హైకోర్ట్ ను ఏర్పాటు చేసి, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూములలో సచివాలయంతో పాటు అసెంబ్లీకు సంబంధించి పర్మినెంట్ భవనాలు కట్టాలని సీఎం జగన్ యోచిస్తున్నారట. దీనిపై మనకు మరింత క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కట్టిన కట్టడాలన్నీ తాత్కాలికమని చెప్పి వేల కోట్ల రూపాయలు తగలేస్తే జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును సరిదిద్దుతూ పేర్మినెంట్ భవనాలను నిర్మిస్తూ రాజధానికి ఒక రూపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్ట్ పెట్టి, ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసి, ఐటి పరిశ్రమను విశాఖకు ఇలా అభివృద్ధిని రాష్ట్రం మొత్తం విస్తరించాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఎవరెంత లొల్లి చేసినా జగన్ సర్కార్ చేయాలనుకుంది చేసి ప్రజల మన్ననలు పొందుతుంది.