చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. ఎన్నో కుల రాజకీయాలతో ఏపీ రాజకీయాలను కంపు కంపు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో బీజేపీ ఎదుగుదలను తెలుగుదేశం పార్టీ అధః పాతాళానికి వెళ్లిపోవడం తట్టుకోలేని బాబు మత రాజకీయాలతో మతాల మధ్య చిచ్చు పెట్టాలని గత వారం రోజులుగా చేయని లొల్లి లేదు. ఇప్పుడు కొత్తగా అమరావతి మండలం వైకుంఠాపురానికి చెందిన ఒక వ్యక్తి వింత వాజ్యం ఒకటి హైకోర్టులో వేసాడు.

అతడు చెప్పేదేమిటంటే శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వకపోవడం దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153 లకు విరుద్ధమని, డిక్లరేషన్ అవసరం లేదని మాట్లాడిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నానితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అశోక్ సింగల్ ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలని పిటిషనర్ హైకోర్టుని అభ్యర్ధించాడు. గత 16 నెలలుగా ఏపీ హైకోర్టులో తీర్పులు ఎలా వస్తున్నాయో తెలిసిందే కదా? దీనితో ఇప్పుడు పచ్చ పార్టీ వ్యక్తి వేసిన ఈ వాజ్యం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.

దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో కాస్త ఆసక్తిగానే ఉంది. పనిలో పనిగా అసలు సీఎం జగన్ ను ప్రజలు ఎలా ఎన్నుకున్నారో, అతడికి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చారో ప్రజలను వివరణ కోరాలని కూడా ఒక వాజ్యం వేస్తే పనైపోతుంది కదా. ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటూ ముసుగులో గుద్దులాటలు ఎందుకు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలను శిక్షించాలని, ఇలా అనేక రకాల వాజ్యాలు వేసి ప్రజలను కఠినంగా శిక్షించాలని ఇలా అనేక వాజ్యాలు వేసి ముప్పుతిప్పలు పెట్టి, ప్రజలను మూడు చెరువుల నీళ్లు తాగించాలని రేపో మాపో వాజ్యం వేసినా వేస్తారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడంతో పాటు రాబోయే రోజులలో బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందన్న వాదనలతో పచ్చ పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉండే మీడియా అల్లాడిపోతున్నారు. చూద్దాం మంత్రులపై, టీటీడీ చైర్మన్ పై వేసిన వ్యాజ్యంలో తీర్పు ఎలా వస్తుందో.

కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకోవద్దని అగ్రహీరోకు చివాట్లు పెట్టిన బాలు

మీరు పాడకపోయినా నా చిత్రాలు హిట్ అవుతాయని బాలుపై హీరో కృష్ణ ఆగ్రహానికి కారణం ఎవరో తెలుసా?