ఏపీలో గురువారం తెల్లవారుజాము నుండే పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 61.65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి కలిపి ఏపీ ప్రభుత్వం 1497.88 కోట్లు విడుదల చేసింది. మరో వైపు ఈ నెల నుండి కొత్తగా 34907 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశారు. వారికి కూడా 8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పెన్షన్లను నేరుగా లభిదారుల చేతికే వాలంటీర్లు అందిస్తున్నారు.

ఇక ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు సైతం వాలంటీర్లే పంపిణీ చేస్తారని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.42.35 లక్షలు విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు.

అఘోరి వెబ్ సిరీస్ తీస్తున్న ధోని..!

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!

సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్..!