దేశవ్యాప్తంగా సోమవారం మద్యం అమ్మకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం 25 శాతం ధరలు పెంచి మద్యం షాపులు ఓపెన్ చేసిన ప్రభుత్వం.. రెండవ రోజు మంగళవారం ఏకంగా 50 శాతం ధరలను పెంచి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో మొత్తం 75 శాతం మద్యం ధరలు పెరిగినట్లయింది. ఇక ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. మందుబాబులు మద్యం దుకాణాల వద్ద భారీగా క్యూ లైన్లు కట్టారు.

కావున ఏపీలో తొలిరోజే 68.7 కోట్ల మద్యం అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం షాపులు తెరవడంతో ఏపీ అబ్కారీ శాఖ ఖజానా భారీగా నిండింది. ఇక రాష్ట్రంలో మద్యం రేట్లను భారీగా పెంచినా కూడా మందుబాబులు ఏ మాత్రం తగ్గలేదు. వైన్ షాపులకు భారీగా తరలివచ్చారు. ఇక రాష్ట్రంలో విజయనగరం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తీర్పు గోదావరి జిల్లాలు మద్యం అమ్మకాలలో టాప్ ప్లేసులో నిలిచాయి. ఇక ఈ నెలాఖరులోగా 15 శాతం మద్యం దుకాణాలు మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

కారు ప్రమాదంలో యువ నటుడు మృతి..!

విద్యార్థుల పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు నమోదు..!