వైఎస్ జగన్ సీఎంగా అధికారాన్ని చేపట్టిన తరువాత ఇసుకపై తీసుకున్న నిర్ణయంతో ఇసుకపై జీవనం సాగిస్తున్న రోజువారీ కూలిలపై పెద్ద పిడుగు పడినట్లయింది. అంతకంటే పెద్ద పిడుగు బిల్డర్స్ పై పడటంతో సీఎం జగన్ ప్రబుత్వంపై రెండు నెలలోను తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇసుక విధాన్నాన్ని వెంటనే అమలు పరచకుండా రెండు నెలలు పైగా ఇసుక క్వారీలు అన్ని మూసివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో సీఎం జగన్ కాస్త సడలించి ఇసుకను క్వారీలలో అనుమతిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ 5 నుంచి ఇసుకపై కొత్త పాలసీ వస్తుందని ఆ లోపు ఇసుకను డబ్బులు కట్టి తోడుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు.

ఇక ఇసుకపై జగన్ చేసిన ప్రకటనతో అక్రమార్కులకు వరంగా మారింది. కొంత మంది ప్రభుత్వ అధికారులు కూడా ఇసుకను ఇష్టమొచ్చినట్లు అక్రమ మార్గాలలో తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కోసారి ఒక్క ట్రాక్టర్ ఇసుకను 10 వేల రూపాయలు పెట్టి కూడా కొనాల్సి వస్తుందని. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినా మూడు వేలకు మించి బ్లాక్ లో ఉండేది కాదని… ఇప్పుడు అది మూడింతలు ఉండటంతో బిల్డర్స్ తో పాటు, ఇల్లు కట్టుకునే వారు ఇసుక సరిగ్గా దొరక్క అక్రమార్కుల చేతిలోకి వెళ్లడంతో లబోదిబో మంటున్నారు.

అసలు కొన్ని చోట్ల అయితే వైసీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించినా అధికారులు వినడం లేదని, అక్రమార్కులకు సహకరిస్తూ లక్షల రూపాయలను రాత్రికి రాత్రే జేబులలో నింపుకుంటున్నారని, వీరందరూ గత ప్రభుత్వ హయాంలో బాగా మేసి ఉండటంతో సీఎం జగన్ తన ఎమ్మెల్యేలకు అందరికి దిశా నిర్ధేశం చేయడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇసుక సరఫరా చేయించాలని చూసినా అక్రమార్కుల దెబ్బకు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తుంది. ఇసుకకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏమి చేయలేకపోతున్నారని ఒక ప్రముఖ పత్రికలోనే కథనం రావడంతో ఎంతలా అధికారులు డబ్బుకి కక్కుర్తి పడుతున్నారో అర్ధమవుతుంది. సీఎం జగన్ కూడా ఇసుకపై పాలసీని తక్షణం అమలు చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇసుకపై సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోక పోతే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు. ఇక కొన్ని క్వారీలలో ఇసుకను వదిలినా కొన్ని వందల ట్రాక్టర్లు బారులు తీరి ఉండటాన్ని కూడా అక్రమార్కులు ఆసరాగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •