ఏపీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు కు వైసీపీ నేత అంబటి రాంబాబు సవాల్ విసిరారు. గుంటూరులో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ని విమర్శించే అర్హత, స్థాయి కోడెలకు లేదని వ్యాక్యానించారు. దుర్మార్గపు చరిత్ర కలిగిన కోడెలకు స్పీకర్ గా కొనసాగే అర్హత లేదన్నారు.

అవినీతిపై చర్చకు రావాలన్న కోడెల్‌ సవాల్‌ని స్వీకరిస్తున్నట్లు పత్రికాముఖంగా తెలిపారు అంబటి. టైం, ప్లేస్‌ చెప్తే చర్చకు వస్తానని వెల్లడించారు. ఓట్లు తొలగింపు కోసమే వైసీపీ సానుభూతిపరుల మీద అప్లికేషన్ లు పెట్టారని ఆరోపించారు. ఓట్ల విచారణ పేరుతో మా వాళ్లని పోలీసు స్టేషన్‌కి పిలిపించారన్నా అంబటి.. మా కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఓట్ల తొలగింపునకు అప్లికేషన్లు పెట్టలేదని వెల్లడించారు.ambati kodela