ఈరోజు నుంచి ఏపీలో తినడానికి తిండి దొరుకుతుందో లేదో పక్కన పెడితే మద్యం మాత్రం దండిగా దొరుకుతుంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని, వ్యాపారులు ఆ సమయంలోనే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం బాధ్యత లేకుండా రోజు రోజుకి కొరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకుండా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం షాపులు తెరవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చూసి అందరూ నివ్వెరపోతున్నారు.

ఉదయం 8 గంటలకే జనం మందు షాపుల ముందు నిలబడటం చూస్తుంటే తినడానికి తిండి ఉన్న లేకపోయినా చుక్క నోట్లో పడాల్సిందే అని వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం 25 శాతం రేట్లు పెంచడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు కూడా ఏపీలో 60కి పైగా కేసులు రావడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంటే జగన్ సర్కార్ నిర్వాకం వలన మద్యం షాపులు తెరుచుకుని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారు కూడా తప్పించుకొని వచ్చి మద్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికలప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఇలా హడావిడిగా మద్యం షాపులు తెరవవలసిన అవసరం ఏమొచ్చిందో అంతుపట్టడం లేదు. ఒకవైపున కరొనతో పోరాటం చేస్తుంటే మద్యం కోసం మందు బాబుల ఆరాటం భయమేస్తుంది. మాములుగా ఉన్నవారిని కట్టడి చేయడానికే పోలీసులకు చాలా కష్టమైన పని, అదే మద్యం తాగి ఉన్నవారిని కట్టడి చేయాలంటే పరిస్థితి కంట్రోల్ తప్పకుండా ఉంటుందా? పనుల్లేక చాలా చోట్ల ఇన్నాళ్లు భర్తలు ఇళ్లకే పరిమితమైతే మద్యం షాపులు తెరుచుకోవడంతో భార్యలు దాచుకున్న డబ్బులు వారిని నుంచి కొల్లగొట్టి మద్యం కోసం ఎగబడుతున్న సంఘటనలు ఎన్నో ఎనెన్నో.

ఎమ్మెల్యే రోజా ఇంకా అలా మాట్లాడటం సిగ్గుచేటు

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది

వరుసగా రెండవ రోజు కేరళలో సున్నా కేసులు