ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గత 24 గంటల్లో 17 కొత్త కేసులు నమోదవడంతో కరోనా భాదితుల సంఖ్య 40 కి చేరింది. ఇక సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక చాలా మందికి కరోనా పరీక్షలు చేయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 పాజిటివ్ కేసులు నమోదవగా, గుంటూరు 9, విశాఖ 6, కృష్ణ 5, తూర్పు గోదావరి 4, అనంతపురం 2, నెల్లూరు, కర్నూల్, చిత్తూర్ జిల్లాలో ఒకొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్యశాఖ తెలియచేసింది.

ఇక చైనా దేశంలో వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ భారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37 వేల మంది మరణించగా, 785700 మంది కరోనా భారిన పడి ఆసుపత్రుల్లో చికిత్య పొందుతున్నారు. ఇక ఇండియాలో కూడా దీని బారిన పడిన వారి సంఖ్య 1281 కి చేరగా, మృతుల సంఖ్య 32 కు చేరింది.