మన ఫోన్లు ఎంత భద్రం అన్న దాని విషయం పక్కన పెడితే… మన దగ్గరే ఉన్న ఫోన్ లో డేటాకు కూడా భద్రత కరువైంది. మన డేటాను సైబర్ నేరగాళ్లు దొంగిలించి వారికి కావలసిన రీతిలో వాడేసుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి సామాన్యుడి కన్నా రాజకీయ నాయకులకు ఎక్కువ ఇబ్బందులు కొని తెచ్చిపెడుతుంది. ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, వీఐపీలకు కూడా ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతుంటే యాపిల్ దీనికి సంబంధించి పరిష్కారాన్ని కనుక్కోవడానికి సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసే లోపాలను గుర్తించిన వారికి ఒక మిలియన్ డాలర్ల బారి బహుమానాన్ని ప్రకటించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 7 కోట్ల రూపాయలకు సమానం.

కానీ యాపిల్ దీనిలో ఒక కండిషన్ పెట్టింది. వినియోగదారుడు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఫోన్ లోకి ప్రవేశించే లోపాలను కనుగొన్న వారికి మాత్రమే ఈ బహుమానం వర్తిస్తుందని వెల్లడించింది. మన ఫోన్ మన చేతిలో ఉన్నా… మన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండానే ఫోన్ హ్యాక్ అవుతుందంటే… యాపిల్ సంస్థ ముందుగానే మేలుకొని వినియోగదారుల భద్రత కోసం చర్యలు గట్టిగానే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •