ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ కాస్పర్ స్కై తెలియచేసిన ప్రకారం ఆపిల్ ఐఓఎస్, మాక్ ఓఎస్ లపై ఇటీవల సైబర్ దాడులు పెరిగాయని అన్నారు. 2019 తొలి సగభాగంలో దాదాపుగా 1.6 బిలియన్ ఫిషింగ్ దాడులు ఆపిల్ ఐఓఎస్ లపై దాడులు జరిగాయని కంపెనీ వెల్లడించింది. కానీ విండోస్, ఆండ్రాయిడ్ ఓఎస్ లతో పోల్చుకుంటే ఆపిల్ ఐఓఎస్ ల మీద దాడులు తక్కువేనని, ఎప్పటికప్పుడు ఆపిల్ సంస్థ తన ఐఓఎస్ కోసం తీసుకునే గట్టి చర్యల వలన దాడులు వాటితో పోల్చుకుంటే చాల తక్కువగా జరుగుతున్నాయి. అయితే యాపిల్ పై జరిగే దాడులు ఐక్లౌడ్ సేవలను అనుకరిస్తూ జరిగేవే అని యాంటీ వైరస్ సంస్థ తెలియచేసింది.