ఐఓఎస్ అప్డేట్ ను యాపిల్ ఫోన్ ఎట్టికేలకు విడుదల చేసింది. సెప్టెంబర్ 17 నుండి ఐఓఎస్14 భారత్ లో అందుబాటులోకి వచ్చింది. భారత్ లో ఆండ్రాయిడ్ వినియోగదారులతో పోలిస్తే ఐఓఎస్ వాడేవారు తక్కువ. అయినప్పటికీ ప్రపంచంలో ఐఓఎస్ రెండో పెద్ద మార్కెట్ గా ఉంది. ఇక ఐఓఎస్ భారతీయ వినియోగదారుల కోసం పలు కొత్త ఫీచర్స్ ను పరిచయం చేసింది.

ఐఓఎస్ 13లో వర్చువల్ అసిస్టెంట్ సిరిలో భారతీయ స్వరాన్ని పోలిన గొంతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఐఓఎస్14 లో దీనిని మరింతగా అప్డేట్ చేసి గ్రాఫిక్స్ పరంగా కూడా పలు మార్పులు చేశారు. సిరి ద్వారా ఐఓఎస్, కార్ ప్లే నుండి ఆడియో మెసేజ్ లు కూడా పొందవచ్చు. అలాగే థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్లను కూడా సిరి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ట్రాన్సలేషన్ యాప్లో ఉన్న అన్ని యాప్ లను సిరి సపోర్ట్ చేస్తుందని యాపిల్ తెలిపింది.

అలాగే మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ భాషలు రాక చాలా ఇబ్బంది పడతాం. అలాంటి కష్టాలకు చెక్ పెడుతూ ప్రత్యేకంగా ఐఓఎస్ 14 ట్రాన్సలేషన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ లో ప్రపంచంలోని 12 భాషలు ట్రాన్సలేషన్ చేసుకోవచ్చు. ఇక హోమ్ స్క్రీన్ లో విడ్జెట్స్, యాప్స్ అన్నింటిని కేటగిరిల వారీగా విభజించి యాప్ లాబ్రరిని మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చారు. ఇక ఫోన్ లో ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాయిస్ కాల్స్ వస్తే అవి స్క్రీన్ పై భాగంగా పాప్ అయ్యేలా కొత్త ఫీచర్ ను యాడ్ చేయడం జరిగింది.