నిన్న సెప్టెంబర్ 10వ తేదీన ఆపిల్ సంస్థ తన కొత్త ఫోన్ లతో పాటు, గాడ్జెట్స్ ను విడుదల చేసింది. ఈ వేడుక కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఐఫోన్ 11 ను విడుదల చేస్తూ, మరికొన్ని గాడ్జెట్స్ కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఐఫోన్ 11 కొత్త ఫోన్ లు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి.

ఇక దరల విషయానికి వస్తే ఐఫోన్ 11 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ లలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర భారత్ మార్కెట్లో 64,900 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ ధరలు 64 జీబీ, 128 జీబీ, 256 జీబీల ధరలు భారత్ మార్కెట్లో ప్రారంభ ధర 99,900 మరియు 1,09,900 ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక భారత్ మార్కెట్లోకి సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానున్నట్లు యాపిల్ సంస్థ తెలియచేస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •