కరోనా వైరస్ ప్రభావంతో చైనా దేశం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా మృతులు 2000 కి చేరారు. రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. అయితే దీని ప్రభావం యాపిల్ కంపెనీపై కూడా పడింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్ల తయారీ దెబ్బతిందని.. ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను సరఫరా చేయలేమని తెలిపింది. అలాగే చైనాలో యాపిల్ స్టోర్ ను కొన్ని రోజుల పాటు మూసి వేశామని.. అమ్మకాలు డిమాండ్ కూడా తగ్గాయని.. కొన్ని స్టోర్స్ ఓపెన్ చేసినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపింది.

ఈ మార్చి క్వార్టర్ ఆదాయ అంచనాలను అందుకోలేమని సోమవారం కంపెని తెలిపింది. ఐఫోన్లు అమ్ముడయ్యే అతిపెద్ద మూడవ మార్కెట్ చైనా అని.. దాని ప్రభావం మార్చి క్వార్టర్ ఫలితాలపై పడుతుందన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •