రోజు పొట్టకూటి కోసం సుదూర తీరాలకు పనికివెళ్ళి వచ్చే తల్లితండ్రులు, ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ సమయంలో చిన్నారి తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక యువతి చేసిన తప్పుకు ఆ బాలుడు చనిపోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. తల్లి తండ్రులు పనికి వెళ్లడంతో ఆ యువతి తన 21 ఏళ్ళ బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలవడంతో ఇంట్లో ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్నారు. బయట ఆడుకుంటున్న ఆ చిన్నారి తమ్ముడు ఇంట్లోకి రావడంతో అతడు వారిద్దరూ ఏకాంతంగా ఉండటం తమ గురించి ఎక్కడ చెప్పేస్తాడేమో అని ఆ యువతి బాయ్ ఫ్రెండ్ ఆ బాలుడిని గొంతు నులిమి చంపేశాడు.

ఇలా అతడు చంపేస్తున్నా ఆ యువతి ఏ మాత్రం మాట్లాడకుండా మౌనం దాల్చింది. కారణం తనకు కూడా తన తమ్ముడు వలన అపాయముందని గ్రహించింది. దీనితో సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తమ తల్లితండ్రులకు ఆడుకుంటూ తమ్ముడు పైనుంచి కిందపడ్డాడని చెప్పుకొచ్చింది దీనితో వారు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొనివెళితే అప్పటికే చనిపోయాడని చెప్పడంతో ఆ పిల్లాడి అంత్యక్రియలు ముంగిచారు. కానీ ఇది జరిగిన రెండు రోజులకు ఆ యువతి తన తమ్ముడు చనిపోయిన విషయం తట్టుకోలేక జరిగిన విషయమంతా ఇంట్లోని తల్లితండ్రులకు చెప్పేసింది.

దీనితో వారు పోలీసులకు కంప్లైన్ట్ ఇవ్వడంతో కేసు ఫైల్ చేసి మరోసారి ఆ బాలుడు శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టంకు పంపించారు. ఇక ఆ యువకుడికి విషయం తెలియడంతో అతడు పరారీలో ఉన్నాడు. ఆ యువతిని బాల నేరస్థుల కారాగారానికి తరలించారు. ఆ యువతి కూడా ఇంకా మైనర్ అని తెలుస్తుంది.తల్లితండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్ రావడం, కొద్ది సేపటికి బాలుడు రావడంతో ఆగ్రహం తట్టుకోలేక చంపేసినట్లు పోలీసుల విచారణలో ఆ బాలిక మొత్తం ఒప్పేసుకునట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో చోటుచేసుకుంది..