ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య ఇంగ్లాండ్ లో మొదలైన యాషెస్ సిరీస్ రేపటి నుంచి రెండవ టెస్ట్ మ్యాచ్ మొదలుకానుంది. ఇక మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లాండ్ బౌలర్ మొయిన్ ఆలీకి గాయం కావడంతో ఆ స్థానంలో స్పిన్నర్ జాక్ లీచ్ ను ఎంపిక చేసారు. తనకు రెండవ టెస్ట్ లో అవకాశం రావడంతో జాక్ లీచ్ మాట్లాడుతూ తన టార్గెట్ ఒక్క స్టీవ్ స్మిత్ కాదని, ఇంగ్లాండ్ బ్యాట్స్ మ్యాన్ 10 మందిని అవుట్ చేయడమే అని చెబుతున్నాడు. తుది జట్టులో తనకు అవకాశం లభిస్తే తన పని తాను చేస్తానని జాక్ లీచ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొయిన్ ఆలీ గాయపడటంతో తుది జట్టులో ఖాయంగా జాక్ లీచ్ ఉండే అవకాశం ఉంది.

ఇక మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా 251 రన్స్ బారి తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ లో చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. అందరూ ఈ ఏడాది జరిగే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ వైట్ వాష్ చేయడం గ్యారెంటీ అని అనుకుంటే మొదటి టెస్ట్ లోనే ఆస్ట్రేలియా తన సత్తా చాటడంతో రేపటి నుంచి జరిగే మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •