ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే ఆ సంస్థ అధినేతలు నారాయణ్ దాస్, సునీల్ నారంగ్ ఇళ్లలో కూడా ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తున్నాయి. మహేష్ బాబు తో కలసి ఏషియన్ సంస్థ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఏఎంబి మాల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఏషియన్ సంస్థ నాగ చైతన్య హీరోగా సినిమా నిర్మిస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు.