సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుందంటే అది వాయుకాలుష్యం వలన అని చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రకరకాల వాహనాల ద్వారా వెలువడే రసాయనాల వలన రక్తంలో కొవ్వు శాతం శరీరంలో పేరుకుపోవడం వలన గుండె సమస్యలతో పాటు, ఊపిరితిత్తుల పనితీరుపై కూడా ఘననీయంగా ప్రభావం పడుతుంది. ట్రాఫిక్ సమయాలలో ప్రయాణమని వీలైనంత తగ్గించుకోవాలని వైద్యులు ఎంత చెబుతున్నా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అది సాధ్యమయ్యే పని కాదు.

వాయుకాలుష్యం వల్ల కలిగే దృష్ప్రబావాలకు ఆస్ప్రిన్ ట్యాబ్లేట్ తో అడ్డుకట్ట వేయవచ్చని ఇటీవల ఒక పరిశోధనలో తేలిందట. బోస్టన్ లో సరాసరిగా 73 ఏళ్ళ వయస్సు కలిగిన 2280 మంది ఊపిరితిత్తుల పనితీరుపై 28 రోజులు పరీక్షలు జరిపి ఈ అంశాన్ని నిర్ధారించారు. ఆస్ప్రిన్ వంటి స్టెరాయిడ్ రహిత నొప్పి నిరోధక ఔషధాలు, కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై పడే ప్రభావాన్ని ఘననీయంగా తగ్గిస్తాయట.