ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ 100 శాతం ఆన్లైన్ చేయాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొత్త రెవిన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

15 రోజుల్లో ఆన్లైన్ లో ఇల్లు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ వివరాలు నమోదు చేయాలనీ సీఎం అధికారులను ఆదేశించారు. పట్టణాలలో, గ్రామాల్లో ఇప్పటికే ఆన్లైన్లో నమోదు కానీ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయాలనీ కేసీఆర్ ఆదేశించారు.