తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజు స్వామి దర్శనం ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉంటుంది. గత 32 రోజులుగా శయణమూర్తిగా దర్శనమిచ్చిన అత్తివరదరాజు స్వామి నేటి నుంచి నిలుచుని విశ్వరూపం అవతారంలో దర్శనమివ్వనున్నాడు.  నేటి నుంచి 18 రోజుల పాటు దర్శనం ఇవ్వనున్న అత్తివరదరాజు స్వామిని ఆ తరువాత ఈనెల 18వ తారీఖున జలగర్మలోకి ప్రవేశం చేస్తారు.

ఇక ఆ తరువాత స్వామిని తిరిగి 2059లో బయటకు తీస్తారు. దీంతో అత్తివరదరాజు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులతో పాటు, విఐపిలు కూడా రావడంతో తమిళనాడు ప్రభుత్వం బారి భద్రత కల్పించింది. ఇక దాదాపుగా 40 ఏళ్ళ తరువాత అంటే మాములు విషయం కాదు. దీనితో భక్తులు స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ 18 రోజులలో దర్శించుకోవాలనుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •