మన దేశంలో అత్యాచారం చేసేవారిపై ఎంతటి కఠినమైన శిక్షలు విధించినా కొంతమంది కామాంధులు దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో నలుగురు యువకులు దిశా అనే యువతిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే వారిని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించింది. ఆ తరువాత అత్యాచారానికి పాల్పడాలని ఆలోచించేవారు బయపడతారని అందరూ భావించారు. కానీ వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షెడ్యూల్ కులానికి చెందిన ఒక 20 యువతి తన తల్లితో కలసి పొలం పనులు చేయడానికి పొలానికి వెళ్లగా అక్కడే ఉన్న అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు ఆ యువతిపై అత్యాచారం చేసి ఆమె తమ పేర్లు చెప్పకుండా ఉండాలని అత్యంత పాశవికంగా ఆమె నాలుక కోసిసారు. యువతిని ముందుగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆమెకు మరింత సీరియస్ గా మారడంతో పెద్దాసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఆ నలుగురు కామాంధులు అగ్రవర్ణాల వారు కావడంతో మొదట్లో కేసు పెట్టడానికి వెనకడుగు వేసినా పోలీసులు యువతి పరిస్థితితో పాటు ఆమె బంధువులు గొడవలకు దిగడంతో ఆ నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఆ యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడంపై ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో దళితులు అగ్రవర్ణాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.