స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఏటిఎంలో డబ్బులు డ్రా చేసే వినియోగదారులకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఎస్‌బీఐలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పని సరి. దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ ఏటిఎంలలో ఓటీపీ బెస్ట్ విత్ డ్రాయల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. అంటే ఎవరి కార్డు అయితే ఉపయోగిస్తారో వారి రిజిస్టర్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మిషన్ లోనుండి డబ్బులు బయటకి వస్తాయి. ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు.

ఏటిఎం కేంద్రాలు దగ్గర మోసాలు, క్లోనింగ్ కార్డు లాంటివి జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఎస్‌బీఐ అమలుచేస్తుంది. అయితే 10,000 నగదు కంటే ఎక్కువ డ్రా చేయాలంటేనే ఓటీపీ తప్పనిసరి. 10,000 కంటే తక్కువ అయితే అవసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది.

స్విగ్గీ మోసంపై డెలివరీ బాయ్స్ తీవ్ర నిరసన.. ఎట్టికేలకు దిగివచ్చిన యాజమాన్యం..!

టిక్ టాక్ ప్రియులకు ఊరట.. యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసింది..!