ఏనుగులను చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడతారు. కొన్ని దేవాలయాల ముందు ఏనుగులను పూజిస్తుంటారు. ఏనుగు తొండంతో ఆశీర్వదిస్తే మంచిదని కూడా భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికన్ ఏనుగులు 4,15,000 ఉన్నాయి. ఆసియన్ ఏనుగులు 50 వేలు మాత్రమే ఉన్నాయి.

ఏనుగుల దంతాలకు చాల డిమాండ్ ఉండటంతో దాదాపుగా 50 శాతం ఏనుగులను దంతాల కోసం స్మగ్లర్లు చంపివేశారు. ఏనుగులను ఇలా చంపివేయకుండా కట్టడి చేయడం కోసం థాయిలాండ్ కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ప్రతి ఏటా ఆగస్ట్ 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •