కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’. ఆగష్టు 9న విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వినపడుతుంది. ఇప్పుడు నాగార్జున వాణిజ్య ప్రకటనలు, బిగ్ బాస్ షోలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగార్జున కుటుంబం అంత ఓ వేడుకలో కలవబోతున్నారట. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే. ఈ పుట్టిన రోజుకి నాగార్జునకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు నాగ్ తన 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అంటే నాగార్జున షష్ఠి పూర్తి చేసుకునే సమయం. ఇదే వేడుకను నాగార్జున, అమల చేసుకోబోతున్నారని సమాచారం.

ఈ వేడుకలను స్పెయిన్లో ఘనంగా చెయ్యాలని నాగ చైతన్య, అఖిల్ భావిస్తున్నారు. అక్కడ రెండు రోజుల పాటు వేడుకలను ఘనంగా చెయ్యాలని.. దానికి టాలీవుడ్ లోని ప్రముఖులను పిలవాలని ఆలోచనలో ఉన్నారు. గతంలో నాగ చైతన్య, సమంతల వివాహంలో కలిసిన అక్కినేని కుటుంబం మళ్ళీ ఈ వేడుకలకు మొత్తం ఒక చోట కలవనుంది.