విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో టూరిజం శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన విషయాలు మాట్లాడారు. సీఎం జగన్ ద్రుష్టి పెడితే ఏపీలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని.. కానీ కొన్ని సిద్ధాంతాలకు లోబడి సీఎం కట్టుపడి ఉన్నారన్నారు. జగన్ ఒప్పుకుంటే టీడీపీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న అవంతి.. చేరే వారి పేర్లు మాత్రం చెప్పలేదు. ఏపీలో ప్రతిపక్షం కూడా ఉండాలని.. వారికి కూడా తగు విలువలు ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ వారిని చేర్చుకోవట లేదన్నారు.

అలాగే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పై అవంతి మండి పడ్డారు. చంద్రబాబు వరదనీరు విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని.. ఆయన హుందాగా వ్యవహరిస్తే మంచిదని హితువు పలికారు. అలాగే టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ సుజనా చౌదరి తాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోవాలని అన్నారు. సుజనా బీజేపీలోకి వెళ్లినా కూడా చంద్రబాబు జపమే చేస్తున్నారన్నారు. ఇక రాజధాని విషయంలో కూడా టీడీపీ అనేక ఆరోపణలు చేస్తుందని.. ఆ విధంగా అనవసర ఆరోపణులు చేయడం మంచిది కాదని.. ఏదైనా ఉంటె ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందన్నారు అవంతి.

avanthi srinivas

  •  
  •  
  •  
  •  
  •  
  •