ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కరోనా మహమ్మారి భారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇటీవల పరీక్ష చేసుకున్న ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

ఇక తాను అందరికి ఫోన్ లో అందుబాటులో ఉంటానని స్వష్టం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారుడు వెంకట శివ సాయి సందీప్ కూడా కరోనా భారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ హోమ్ ఐసొలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

తెలంగాణలో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు

అఖిల్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున..!

పవన్ కళ్యాణ్ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్..!