ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని అయోధ్యకు ఒక పరిష్కారం దొరకడంతో పాటు అక్కడ అత్యంత సువిశాలంగా రాములోరి గుడి నిర్మిస్తుండటంతో పాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ భావిస్తుండటంతో అయోధ్యలో 50 శాతం మేర భూముల ధరలకు రెక్కలు వచ్చాయట. అయోధ్యలో ఒక విమానాశ్రయంతో పాటు ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అయోధ్యను ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని యోగి ప్రభుత్వం భావిస్తుంది. దీనితో అయోధ్యలో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పేకమేడలా కూలిపోతే అయోధ్యలో మాత్రం రాములోరి గుడి నిర్మాణంతో పాటు యోగి తీసుకున్న నిర్ణయాలు రియల్టర్లకు కలిసొచ్చినట్లు చెప్పుకోవచ్చు. దీనితో ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ వ్యాపారుల కన్ను అయోధ్యపై పడటంతో పాటు అందరు అక్కడే తిష్ట వేసారట. ఇక ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి యోగికి లేఖ రాస్తూ వెంకటేశ్వర స్వామి లయ నిర్మాణానికి తమకు ఐదెకరాల భూమి కేటాయించాలని కోరిన సంగతి తెలియసిందే. యోగి ఆదిత్యనాధ్ వెంకటేశ్వర స్వామి గుడికి కూడా స్థలం కేటాయిస్తే అయోధ్య ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.