రోజు రోజుకి కాలానుగుణంగా వస్తున్న మార్పులు. ఎక్కడపడితే అక్కడ చెట్లు నరికివేస్తూ ప్రభుత్వాలు సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో… పొల్యూషన్ నగరాలుగా మారుతున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై ఒకవైపున శ్రద్ధ పెట్టలేక.. మరోవైపున పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతలా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించినా బయట ఉండే పొల్యూషన్ తో మనిషి ప్రాణం సగం అక్కడే పోతుంది.

ఈ విషయంలో ఆస్ట్రేలియా విషయానికి వస్తే అక్కడ జీవన ప్రమాణాలు అందరి కంటే ఎక్కువగా ఉన్నాయని ఒక సర్వే తెలియయ చేస్తుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచంలో అందరి కంటే మగవారి సగటు జీవితకాలం ఎక్కువని తేలింది. అక్కడ వారి ఆయుర్ధాయం 74.1 సంవత్సరాలని అంచనా.  డాక్టర్ కొలిన్ పెయిన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ జాతీయ విశ్వ విద్యాలయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. స్విట్జర్లాండ్ తరువాత ఆస్ట్రేలియన్ మహిళలే ఎక్కువ కాలం జీవిస్తునట్లు తేలింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •